![]() |

బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే కార్యక్రమాల్లో ప్రధానంగా కుటుంబ సంబంధాలు, దాంపత్య బంధాలపై జరిగే డిబేట్స్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రిలీజ్ అయ్యింది.తాజాగా ప్రసారంకానున్న ఓ షోలో “మొగుళ్లు కరెక్టా? పెళ్ళాలు కరెక్టా?” అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రోమో స్టార్టింగ్ లో హోస్ట్ సరదాగా “ఈరోజు మొగుళ్లు కరెక్టా లేదా పెళ్లాళ్లు కరెక్టా అనేది తేల్చేయబోతున్నాం” అంటూ సందడి చేశారు. ఇక ఈ షోకి "సేవ్ ది టైగర్స్ 3 " సీజన్ నుంచీ నటీనటులు వచ్చారు.
.webp)
తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు." గేట్ కమిటీ గేట్ కమిటీ అంటారు . గేట్ కమిటీ లేమున్నదండీ " అండూ ప్రియదర్శి అడిగాడు. " గేట్ కమిటీ కాదు. గేటెడ్ కమిటీ " అన్నాడు అవినాష్. "మా ఆయన గట్లనే అంటడు నువ్వు చెప్పు బేబీ" అంటూ జోర్దార్ సుజాత వాళ్ళ ఆయన్ని వెనకేసుకొచ్చింది. " ఆమె బేబీ అని ప్రేమగా పిలుస్తుంది కదండీ" అని శ్రీముఖి అనేసరికి " ఆమె బేబీ అన్నా బర్రె అన్నట్టే ఉంటుంది." అన్నాడు అభినవ్ గోమఠం. "ఆ అమ్మాయి ఒక తమిళ్ సీరియల్ ఒకటి సైన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే ఒక చాలా పెద్ద గ్యాప్ అనేది వచ్చింది."
అంటూ శ్రీముఖి తేజస్విని గౌడ, అమరదీప్ ని ఉద్దేశించి చెప్పింది. " నా గ్యాప్ తో ఏ ప్రాబ్లం లేకపోవడం, దాని ప్రాబ్లం " అన్నాడు అమరదీప్. ఇంతలో యాదమ్మ వాళ్ళ వైఫ్ స్టెల్లా " ఒక రిలేషన్‌షిప్ లో కావాల్సింది నమ్మకం, ప్రేమ." అంది. "విక్రమ్ నీ నుంచి భరణం కావాలని అనుకుంటాడు " అంటూ శ్రీముఖి చెప్పేసరికి "అతనికెందుకు ఇవ్వాలి నాకే అతను ఇవ్వాలి " అంటూ రేఖ అలియాస్ దేవియని శర్మ అడిగింది. "నువ్వు కూడా సంపాదిస్తున్నప్పుడు విడిపోయినప్పుడు నీది కూడా నాకు ఇవ్వాలి " అన్నాడు విక్రమ్ అలియాస్ చైతన్య . "మీరు ఎంత కరెక్టుగా చెప్తున్నారని అంటే మిమ్మల్ని నమ్ముకొని గంగూలీ కూడా పక్కనుంచి ఇదేదో కరెక్ట్ గా ఉన్నట్టుంది" అనుకుంటున్నాడు అంది శ్రీముఖి . తర్వాత ప్రియదర్శి " ఇది యాక్చువల్లీ మనం అంటుంటాం కదా. లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ " అంటూ తెగ క్లాస్ తీసుకున్నాడు ప్రియదర్శి. దాంతో ఎవరికీ వాళ్ళు లేచి వెళ్లిపోయారు. ఇక శ్రీముఖి ఐతే "మీకు అర్ధం కావట్లేదు మీరు టూ డేస్ నుంచి చెప్తున్నారు." అంది. దాంతో ప్రియదర్శి ఫీలైపోయాడు.
![]() |